దుబాయ్‌లో ఘనంగా గణేష్ నవరాత్రులు

దుబాయ్, సెప్టెంబర్ 21: దుబాయ్ డి.ఐ.పీ హెచ్‌పీబీఎస్ కంపెనీలో తెలంగాణ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తూ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తుతున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ప్రవాస భారతీయులు దగ్గరుండి విజయవంతం చేశారు. గణపతి బప్పా ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మండలి సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ గణేష్ మండలి సభ్యులు, భక్తులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.