

మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. అందిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


