నిజామాబాద జిల్లా,నవీపేట్ మండల్ :- స్థానిక శ్రీ మహాలక్ష్మి గణేష్ మండలి వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహ దాత దంపతులు వేముల ఈశ్వర్–సహస్ర దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views:33
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.