

ఈ సందర్భంగా నవీపేట ఎస్సై శ్రీకాంత్, లోకం సందీప్, ఆర్మూర్ పట్టు మాజీ ఎంపీపీ రాజేందర్‌కుమార్ రెడ్డి (చిన్న), సర్పంచ్ సురిబాబు, గ్రామ పెద్దలు లోకం నర్సయ్య, సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ నవీన్‌రాజ్ తదితరులు రూట్‌ను కాలినడకన పరిశీలించారు.
శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, రహదారుల పరిస్థితి, భక్తుల రాకపోకలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.


