నవీపేట్ లింగామయ్య గుట్ట లడ్డు వేలం పాట

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలో:- గణేష్ చవితి ఉత్సవాల్లో భాగంగా లింగమయ్య గుట్ట కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ శివపురి గణేష్ మండలిలో కొలువుదీరిన గణనాథుని లడ్డు ను గురువారం రాత్రి వేలం వేయగా కాలనీకి చెందిన చేపల పోశెట్టి 25 వేల 5 వందల 11 రూపాయలకు కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం ముగిసిన తర్వాత గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ వేలం పాటలో లింగయ్య గుట్ట కాలనీవాసుల తో పాటు మండల కేంద్రానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.