
కామారెడ్డి జిల్లా సెప్టెంబర్26 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శనివారం ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ లో ఉచిత యోగ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి మాట్లాడుతూ… వర్డ్ సంస్థ నుండి 18 సంవత్సరాల లోపు బాల బాలికల వారి ఆరోగ్యానికి సంబంధించిన కంటి సి బి పి జనరల్ పరీక్షలు, జిల్లా వైద్య సిబ్బంది సహకారంతో రోటరీ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి,రోటరీ క్లబ్ సెక్రెటరీ సంతోష్ కుమార్, వైద్య నిపుల అధికారి వీరేశం, జిల్లా హెచ్ఐవి, ఎయిడ్స్ ఆఫీసర్ డా ప్రదీప్, ఎంసీ రమేష్, యాదగిరి, సాయిబాబా వంశీకృష్ణ నర్సింలు శ్రీవిద్య వివిధ గ్రామాల బాల బాలికల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


