బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడి హల్‌చల్

నవీపేట్:
బాసర గోదావరి బ్రిడ్జిపై నవీపేట్ మండలానికి చెందిన ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. యువకుడి చర్యతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం యువకుడిని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ క్రమంలో యువకుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా యంచా సర్పంచ్ సాయిలు, ప్రవీణ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌తో పాటు పలువురు యువకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. యువకుడికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు సహకారం అందించారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.