బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతి నాయక్

అక్కన్నపేట, తెలుగు కె న్యూస్

అక్టోబరు 2పెద్దతండాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్‌ను బీజేపీ రాష్ట్ర గిరిజన (ఎస్టీ) మోర్చా అధికార ప్రతినిధిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ రామచంద్రరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నేనావత్‌ రవినాయక్‌ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ బాధ్యత అప్పగించేందుకు సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు తిరుపతి నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, గిరిజన తండాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :