

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వర్షిణికి అండగా సర్పంచ్ గైని వసంత సతీష్ రూ.10 వేల ఆర్థిక సహాయం, ఉపసర్పంచ్ గోపి గౌడ్ రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి. ప్రియాంక, వార్డు సభ్యులు లక్ష్మి, నర్సవ్వ, శెట్పల్లి పవన్ రెడ్డి, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, అసది సవిత, బచ్చల లత పాల్గొన్నారు.
అలాగే VDC పెద్దలు అంతకోళ్ల గంగన్న, బొర్ర సురేష్, పండ్ల శ్రీనివాస్, మంత సాయిబాబ, మారట నగేష్, పూదరి గంగన్న, గొల్ల సాయిలు, గైని సాయందర్, అన్నారం రమేష్ పాల్గొని వర్షిణికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తూ అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి, నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.







