అగరమంగళం సచివాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 15. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం అగరమంగళం గ్రామ సచివాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ ప్రియా, వెల్ఫేర్ అసిస్టెంట్ కిషోర్ కుమార్,విఆర్ఓ సాధు సుందర్, ఇంజనీర్ భరత్ కుమార్, మహిళా పోలీస్ స్వాతి మరియు ఏఎన్ఎమ్ సరిత ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జి ఆనందబాబు జై హింద్ నినాదాలతో దేశభక్తిని చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు టీడీపీ పురుషోత్తమ నాయుడు, వెంకటేశులు మరియు మునిరత్నం నాయుడు పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :