
కె24న్యూస్ తెలుగు ఆగష్టు 03. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కుప్పం ఎమ్మార్పీఎస్ నాయకులు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి, దళితులు మరియు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్బంగా MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ బైరెడ్డిపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం కో-ఇంచార్జి పి.వెంకటేష్, బి.గోవిందప్ప, మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షులు జయప్ప, శంకర్ మరియు గణేష్ పాల్గొన్నారు.








