
కె24న్యూస్ తెలుగు జూన్ 30. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తహసీల్దార్ రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన పౌర హక్కుల దినోత్సవం దళితుల పట్ల సమాజ బాధ్యతను గుర్తుచేసింది. ఎంపీ ప్రకాష్ సమక్షంలో దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, వివక్ష, సంక్షేమ పథకాల లోపాలపై సుదీర్ఘచర్చ జరిగింది. బాధితుల ఆవేదనను ఆలకించిన తహసీల్దార్ రమేష్‌బాబు, వెంటనే క్షేత్రస్థాయిలో భూ రికార్డులను పరిశీలించి, అర్హులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కుల వివక్షకు తావులేకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, దళిత హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.




