
కె24న్యూస్ తెలుగు ఆగష్టు 17. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్‌ను కుప్పం నియోజకవర్గ బహుజనసేన,MRPS నాయకులు కుప్పంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కుప్పం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, వివక్ష మరియు భూసమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మల్లనూరు పంచాయతీలోని గొడిగడ్డల చెరువు సమస్యను దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ అయన దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం కుప్పం నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలు మరియు దళితుల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు బహుజనసేన నిరంతరం పోరాడుతుందని బహుజనసేన కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు S.మహేష్ కుమార్ తెలిపారు. నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన శ్రీకాంత్, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో బాల, చంద్రబాబు దళిత సీనియర్ నాయకులు పాల్గొన్నారు.






