
కె24న్యూస్ తెలుగు జులై03. గంగాధరనెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం తయ్యూరు పాయకట్టు లోని ఆరిమాకులపల్లి శ్రీ ఆరిమాని గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యురాలిగా ఎస్.అమృతచంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ బాధ్యతను కల్పించిన చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మకు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.యం.థామస్‌కు, జనసేన ఇంచార్జి పొన్న యుగంధర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారిపై నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, ఆలయ అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాలకు తన పూర్తి సహకారం అందిస్తానని, నిధులను పారదర్శకంగా వినియోగిస్తానని అమృతచంద్రశేఖర్ పేర్కొన్నారు.


