అందరికీ నమస్కారం. వరినాటు పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రం నుండి కోస్లీ గ్రామానికి కూలీలు రావడం జరిగింది. ఈ రోజు వారు కోస్లీ గ్రామానికి చెందిన డాంగే రాజబాబు పొలంలో వరినాటు పనులు పూర్తి చేసిన అనంతరం, బోలెరో వాహనంలో తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా, కోస్లీ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. బోలెరో వాహనాన్ని నడిపిన డాంగే రాజబాబు అతి వేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోలెరో వాహనంలో ప్రయాణిస్తున్న సంజీవ్‌తో పాటు మరో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కూలీలను పనికి పిలిపించిన కోరపల్లి సురేష్ (కోస్లీ గ్రామం) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బోలెరో వాహన డ్రైవర్ డాంగే రాజబాబుపై సంబంధిత చట్టాల ప్రకారం నవీపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

అతి వేగమే ప్రమాదానికి కారణం.. బోలెరో బోల్తా, ఐదుగురు కూలీలకు గాయాలు
నవీపేట్, జూలై 16: నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం :- కోస్లీ గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరినాటు పనుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు కోస్లీ గ్రామానికి చెందిన డాంగే రాజబాబు పొలంలో పని ముగించుకుని బోలెరో వాహనంలో తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా, గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
వాహనాన్ని డాంగే రాజబాబు అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో సంజీవ్‌తో పాటు మరో నలుగురు కూలీలు గాయపడగా, స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కూలీలను పనికి తీసుకొచ్చిన కోస్లీ గ్రామానికి చెందిన కోరపల్లి సురేష్ ఫిర్యాదు మేరకు, బోలెరో డ్రైవర్ డాంగే రాజబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :