
కరీంనగర్, K24 న్యూస్ తెలుగు జూలై 16:
తిమ్మాపూర్ మండలం రేణికుంట సమీపంలోని ఓ రైస్ మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా బియ్యం రీపాలిషింగ్ జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు పాల్గొన్నారు.








