ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గి గ్రామ ఉపసర్పంచ్

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి ఎమ్మెల్యే *మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో *ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకం కలిగి ఉపసర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన ఉపసర్పంచ్ తిరుపతికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధికి & పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :