
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అధికారి ముకందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్) అధికారులు రైల్వే పోలీసుల సహకారంతో నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల ఎండు గంజాయి పట్టుబడినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. అయితే గంజాయిని తరలిస్తున్న నిందితులు మాత్రం అధికారులకు చిక్కకుండా పరారైనట్లు పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ తెలిపారు.గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. రైల్వే మార్గాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సంయుక్త తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డీటీఎఫ్ సీఐ సుందల్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, శరత్ కుమార్, ట్రైనీ ఎస్సైలు అనిల్, మధుతో పాటు సిబ్బంది జాన్, ఫరీద్, అమృత్ రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, శరత్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.




