కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ఆదర్శ పాఠశాలలో ఆషాఢ బోనాల వేడుకలు

 

నిజామాబాద్ జిల్లా,నవీపేట్: మండల కేంద్రంలోని :-ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో శుక్రవారం ఆషాఢ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం పాఠశాల నుంచి సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, సమాజంలో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.