నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ కేంద్రంలో :- బీజేపీ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరిన్, కార్యవర్గ సభ్యుడు భారత్‌రెడ్డి, ప్రవీణ్, రాజేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.