

నవీపేట: సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నవీపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు రామా గౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుభాష్ గౌడ్, రాజేందర్ గౌడ్, భానుచందర్ గౌడ్, నరేష్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నవీపేట మండల కేంద్రం నుంచి గౌడ సంఘం ప్రతినిధులు, గౌడ సోదరులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.




