కొమురవెల్లి అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్

తెలుగు కే న్యూస్ కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, సీసీటీవీ మానిటర్, మూడు మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొమురవెల్లి, మెదక్ జిల్లా కుల్చారం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అభినందించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :