
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణలో బీసీల కులగణన చేపట్టాలని అన్నారు.గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ఢిల్లీలో జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో జాతీయ జనగణనలో బీసీ కులగణనను కూడా చేపడతామని కేంద్ర మంత్రులు ప్రకటించారు.ప్రధాని మోదీ సైతం కులగనన జరుగుతుందని వెల్లడించారు.ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో బీసీ కులాల ప్రస్తావన లేదు. కేంద్రం బీసీలను నమ్మించి మోసం చేస్తుంది .ఇకనైనా బీసీలకు యూనిక్ కోడ్ కేటాయించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రాష్టం లో అధిక జనాబా ఉన్నటివంటి బిసిల లెక్కలు తెల్చాలని అప్పుడే బిసిలకు జనాబా దామాషా ప్రకారం విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాల్లో ప్రాతినిత్యం ఉంటుందని అన్నారు. అలాగే మహిళా బిల్లులో బిసిలకు ప్రత్యేక కోటా కేటాయించిన తర్వాతనే మహిళా బిల్లు ని ప్రవేశపెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రశాంత్,రాజేందర్ నవీన్,సురేష్,నితిన్, శ్రీధర్,పవన్,సంతోష్, విక్రమ్,రమేష్,శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




