
మంచిర్యాల జిల్లా, జూలై 1: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) డిస్పెన్సరీలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎంలు ఎం. నరసింహరావు, ఎం. మదన్‌మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమైనవని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా STPP డిస్పెన్సరీ వైద్యురాలు డా. బి. జానకి, రిటైర్డ్ డా. ప్రభాకర్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


