

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘అంత్యోదయ’ సిద్ధాంతం గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ నిధులను వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
సర్పంచ్ మహాంతం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు భూమేష్, బినోల్, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు రమణ, కోరే గంగాధర్, భూమయ్య, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


