
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా పెద్ద కొడపడ్గల్ గ్రామానికి చెందిన పండరి నిరుపేద కుటుంబానికి గంజి వెంకటేశం దుస్తువులు అందజేశారని శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి అవసరమైన దుస్తువులు షర్ట్లు ,ప్యాంటు బనియన్లు అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
మానవత్వంతో ముందుకు వచ్చి అవసరమైన సమయంలో అండగా నిలిచిన గంజి వెంకటేశం కి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టంశెట్టి శ్రీనివాస్,కోడిప్యాక సాయిరాం,గంజి వెంకటేశం,మచ్చ నాగరాజు గుప్తా,భాస్కర్ రావు,శ్రీకాంత్ పిట్ల స్వామి, పాల్గొన్నారు.




