
సిద్దిపేట రూరల్, తెలుగు కే న్యూస్ జూలై 2:
పుల్లూరు గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలపై విధించిన లాక్‌లను వెంటనే తొలగించాలని బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సంక్షేమ పథకాల నిధులు, రైతు భరోసా, పింఛన్ నగదును ఖాతాదారులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించి అర్హులైన ఖాతాదారుల ఖాతాలను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రాజు పాల్గొన్నారు.


