
కామారెడ్డి, జూలై 20 (K24 న్యూస్):
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి 121 దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులు నిబంధనల మేరకు ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.







