
బెజ్జంకి, తెలుగు కే న్యూస్ జూలై 16: బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై చేపట్టిన వాహన తనిఖీల్లో గగ్గిళ్లాపూర్ స్టేజ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ (TS 22 T 4364), ట్రైలర్ (TS 22 T 7178)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో తోటపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ గొల్ల రాజ్‌కుమార్, వాహన యజమాని ఉల్లి నరేష్ ఆదేశాల మేరకు మొయతుమ్మెద వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ టి. తిరుపతి తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.









