బెస్ట్ బ్యాట్స్ మెన్ అవార్డు అందుకున్న పల్లపు భరత్

జగిత్యాల జిల్లా, జూలై 20(తెలుగు కే న్యూస్)::ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ టీ20 ఛాంపియన్‌షిప్ – 18వ ఫెడరేషన్ కప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన పల్లపు భరత్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.పల్లపు భరత్, పల్లపు నర్సయ్య మరియు పల్లపు లలిత దంపతుల కుమారుడు,ఆయన స్వస్థలం తిమ్మయ్యపల్లె గ్రామం, కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ ఈ టోర్నమెంట్ మొత్తం అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో “బెస్ట్ బ్యాట్స్‌మన్ అవార్డు”ను అందుకుని తన గ్రామానికి, జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.పల్లపు భరత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా అభినందనలు మరియు శుభాకాంక్షలు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.