
- కరీంనగర్ తెలుగు కే న్యూస్ బొమ్మకల్: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బొమ్మకల్ లో మంగళవారం విద్యార్థులకు ప్లేట్ మరియు గ్లాస్ ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కరీంనగర్ కు చెందిన టీ మొబైల్స్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జి . అనిత గారు, పి శ్రీధర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయురాలు గీత గారు మరియు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులందరికీ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేయగా, పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం దాతలకు ధన్యవాదాలు తెలిపారు.




