
తెలుగు కే న్యూస్ | జులై 17
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామంలో భూముల రీ-సర్వే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి పాల్గొని రీ-సర్వే విధానం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పారదర్శకంగా రీ-సర్వే చేపట్టిందని, దీనివల్ల భూ సరిహద్దులు స్పష్టమై భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులు అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.








