వనమహోత్సవంలో ఈతమొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ

కామారెడ్డి, జూలై 21 (K24 న్యూస్): వనమహోత్సవం సందర్భంగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈతమొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణతో పాటు గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఈత చెట్ల పెంపకం ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.