

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. నీటిలో మునిగిపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అన్నాచెల్లెలు వాగులోకి ఎలా వెళ్లారు, ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.


