వికలాంగుల హామీలు వెంటనే అమలు చేయాలి: సత్యనారాయణ

లక్షేట్టిపేట, జూలై 15 (తెలుగు 24 కె న్యూస్): ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్, బస్సు–రైలు పాస్‌ల పునరుద్ధరణతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం లక్షేట్టిపేట పట్టణ, మండల నూతన కమిటీలను ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :