విద్యారంగంలో కామారెడ్డి జిల్లాకు అన్యాయం విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధిలో కామారెడ్డి జిల్లా నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన కీలక విద్యాసంస్థలు, ఉన్నత విద్యా కోర్సుల విషయంలో ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు పాఠశాలలు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, జిల్లా కేంద్రం అయిన కామారెడ్డి నియోజకవర్గానికి మాత్రం యంగ్ ఇండియా స్కూల్ మంజూరు కాలేదని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించే ఇలాంటి పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

పూలే జయంతి కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వారం రోజుల్లో కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు అవుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పాఠశాల మంజూరు కాకపోవడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రత్యేక చొరవ తీసుకుని యంగ్ ఇండియా స్కూల్‌ను కామారెడ్డికి మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో MBA, MCA వంటి PG కోర్సులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఇతర జిల్లాలు, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని అన్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి వస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం లభిస్తుందని తెలిపారు.

ఇక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కోసం భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో భూమి కేటాయించారని తెలిపారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలోనే ATC ఏర్పాటు చేస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులకు రవాణా పరంగా మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ATC విషయంలో కూడా జిల్లా కేంద్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

యంగ్ ఇండియా స్కూల్, MBA–MCA వంటి PG కోర్సులు, ATC విషయంలో కామారెడ్డి జిల్లా విద్యార్థులకు న్యాయం చేయాలని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ అంశాలపై ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

కామారెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సేన ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు పాషా, ప్రధాన కార్యదర్శి చందు, కార్యదర్శి అశ్విని, విద్యార్థి సేన నాయకులు నోమన్, ప్రణయ్ రిత్విక, వేణు, హిమశ్రీ, యాసిన్, మరియు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.