
తెలుగు కే న్యూస్ కేశ్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని జోగ్యతండలో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా రామావత్ బోడ–సునీత దంపతుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ధాన్యం, బట్టలు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం, రూ.50 వేల విలువైన ధాన్యం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. సర్పంచ్ రాజు నాయక్ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప సర్పంచ్ పద్మ బీమ్లా నాయక్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.








