సిఐటియులో చేరిన విద్యుత్ రంగ కార్మికులు

కామారెడ్డి జిల్లా : తెలుగు కే24 న్యూస్
విద్యుత్ రంగ ఉద్యోగులు, కార్మికుల సంఘం (సిఐటియు) సర్వసభ్య సమావేశం కామారెడ్డిలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన పలువురు సిఐటియులో చేరారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్మికులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, గంగాధర్, జిల్లా కార్యదర్శి మోహన్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సునీల్ గౌడ్, ఉపాధ్యక్షుడు నర్సా గౌడ్, బాలరాజు, బాలేశం, నర్సింలు, రాఘవాచారి, దేవదాస్, అశోక్ రెడ్డి, రవికుమార్, ప్రశాంత్, ప్రతాప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :