సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

తెలుగు కే న్యూస్ కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ-జీవన్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దూలం నారాయణ (రూ.50,000), నేదునూరి సంపత్ (రూ.26,000), అన్నాడి చందు (రూ.30,000), చిట్యాల కొమురయ్య (రూ.23,000), గర్రెపల్లి పద్మ (రూ.14,000), మంద శ్రీను (రూ.33,000) చెక్కులు అందుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అర్హులైన పేదలకు సీఎం సహాయనిధి అందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బద్దం రాజిరెడ్డి, ఉపసర్పంచ్ రంగనవేని వెంకటస్వామి, గర్రెపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :