
మంచిర్యాల, జూలై 16 (తెలుగు కే న్యూస్): జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసును పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. ఈ నెల 11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న రామగుండం కమిషనరేట్ హోంగార్డు లక్ష్మణ్‌ను నజీర్పల్లి పైవంతెన వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దర్యాప్తులో ప్రమాదానికి కారణమైన వాహనం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన TS20 Z 0012 నంబర్ ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. బస్సు డ్రైవర్ బెజ్జూర్‌కు చెందిన జంగిటి రాజేశ్‌ను గుర్తించి విచారించగా ప్రమాదానికి సంబంధించి వివరాలు వెల్లడించినట్లు జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు.








