
తెలంగాణ తెలుగు కే న్యూస్ఆ గస్టు 11: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నారుతనిఖీల కోసం విద్యాశాఖ 307 అకడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న బోధన, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిసరాల పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించనున్నాయి.తనిఖీల అనంతరం పాఠశాలల పరిస్థితిపై సమగ్ర నివేదికలను విద్యాశాఖకు సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.




