రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణ ప్రజలతో మమేకమవుతూ రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు ఇవ్వకుండా సామాన్య ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది.
ప్రయాణ సమయంలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులతో బండి సంజయ్ ముచ్చటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బండి సంజయ్ ఆటోలో ప్రయాణిస్తున్న విషయం
సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణించడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన ఆటో ప్రయాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :