ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం.. 12వ వార్డులో కొత్త బోరు ప్రారంభించిన కౌన్సిలర్ షరీఫా బేగం

చేర్యాల, జూన్ 23 (తెలుగు కే న్యూస్):
ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేర్యాల మున్సిపాలిటీ 12వ వార్డులో నూతన బోరు మోటర్‌ను కౌన్సిలర్ మహమ్మద్ షరీఫా బేగం ఖాజా మంగళవారం ప్రారంభించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, తనను గెలిపించిన వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, “ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం” అని అన్నారు.
కార్యక్రమంలో చేర్యాల మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎం.డి. ఖాజా, కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి సంతోష్, అంబటి అంజయ్య, పచ్చిమట్ల వెంకటయ్య, మాచర్ల వెంకటేష్, కాంగ్రెస్ మైనార్టీ నేత ఎం.డి. జహీరొద్దీన్, ఎం. రాజేష్, వి. ప్రశాంత్, బాలయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి రిషిత, వీరబత్తిని లలిత, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :