మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో గుడికందుల గ్రామాన్ని సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్

సిద్దిపేట పోలీస్ శాఖ k24 న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సోమవారం మీరుదొడ్డి మండలంలోని గుడికందుల గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 సీసీటీవీ కెమెరాలు, గ్రామ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామ యువతతో కలిసి నిర్వహించిన వాలీబాల్ మ్యాచ్‌ను ప్రారంభించిన సీపీ, రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.
గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముగ్గుల పోటీల విజేతలు, వాలీబాల్ క్రీడాకారులకు హెల్మెట్లను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్, సీఐ రాజేష్, ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :