
కె24న్యూస్ తెలుగు జూలై04. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అర్తాల అల్లెయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నప్రసాద వితరణ ఘనంగా జరిగింది. పోలీస్ అధికారి చంద్రశేఖర్ రామయ్య సుపుత్రుడు నితిన్ శేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు అర్తాల కేశవులు, ఎస్. ధన్యవాణి, మునెమ్మ, లక్షిత్, విశ్వజిత్, కె. ఏకాంబరం, రమ్య, కె.ఇ. జ్యోషిత్, జి. దివ్య, వాలంటీర్లు తరుణ్, నరేష్, మధు, లక్ష్మి పాల్గొన్నారు. బాబు నితిన్ శేఖర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, రోగులకు భక్తిశ్రద్ధలతో అన్నదానం చేశారు. ఈ సేవలు అందరి ప్రశంసలు పొందాయి.




