గన్నేరువరం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి

K24 న్యూస్ గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నియమించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే తన నియామకానికి సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :