రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో అధికారి వెంకన్న మృతి

మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

K24న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో అధికారి వెంకన్న మృతి చెందారు.
వివరాల ప్రకారం, హైవేపై ప్రయాణిస్తున్న వెంకన్నను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో రవాణా శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్టీవో అధికారి వెంకన్న ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వెంకన్న సేవలను గుర్తు చేసుకున్న మంత్రి, ఆయన మరణం శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :