
తెలుగు కే న్యూస్ ఇల్లంతకుంట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇల్లంతకుంట మండలంలో పాఠశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గురుకులాలు, వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అఖిల్, ప్రవీణ్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

