
కామారెడ్డి జిల్లా K24 న్యూస్ తెలుగు : దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సదుపాయాలపై ఆరా తీశారు. దోమతెరల వినియోగం, యూనిఫాంల పంపిణీ, పోషకాహారం, పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. బాల్య వివాహాల నివారణపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.

