జులై 2 న ఉప్పల్ భగయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు పెద్ద ఎత్తున నాయకులు తరలి రావాలి

కామారెడ్డి జిల్లా :తెలుగు k24 న్యూస్

జులై 2 న ఉప్పల్ భగాయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు రవీందర్ గుప్తా కోరారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మర్చిపోయిందన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, ఉద్యమకారుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అద్వర్యంలో నిర్వహిస్తున్న భూపోరాట సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు
అల్తాఫ్, ఏసు, మమత పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :